- కల్లూరు మండలంలో కీలక కార్యక్రమాలు
- మర్లపాడులో దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ
- చిన్న కోరుకొండిలో రూ.20 లక్షల సీసీ రహదారులకు శంకుస్థాపన
కల్లూరు,ఆర్గాన్ న్యూస్,జనవరి 1 :
కల్లూరు మండలంలో దివ్యాంగుల సంక్షేమం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా కీలక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో దివ్యాంగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సుమారు రూ.80 వేల విలువ గల బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాచబంటి చిన్న కృష్ణయ్య,ఉపసర్పంచ్ జగదభి సీతారామరాజు,మాజీ జెడ్పిటిసి కట్టా అజయ్ కుమార్ లు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మగౌరవం,స్వావలంబన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోదుగు వీరయ్య, రాజమండ్రి ముత్తారావు రెడ్డి,చర్ల నాగరాజు,ఎం.నాగేశ్వరావు, ఎం.వెంకటరత్నం,బుచ్చిబాబు, వార్డు సభ్యులు తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదే మండలంలోని చిన్న కోరుకొండి గ్రామంలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల అంచనాతో చేపట్టనున్న సీసీ రహదారుల నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ బూదాటి గీతారెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని,సీసీ రహదారుల నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ గుజ్జు చిన్న పుల్లదాసు,విశ్రాంత ఏఎస్ఐ కుమ్మరి రామారావు,ఉపసర్పంచ్ రెడ్డి సుబ్బారావు,కాంగ్రెస్ నాయకులు కొంగర రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ చినాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


