- ఆర్గాన్ పత్రిక కథనానికి స్పందించి సహాయం అందించిన డాక్టర్ సృజన్.
చింతకాని ఆర్గాన్ న్యూస్, జూన్ 1:
మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్వరరావు కుటుంబానికి ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అల్లాడి సృజన్ అండగానిలిచి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 2024 లో సంభవించిన వరదల సమయంలో నాగేశ్వరరావు తన భార్యతో కలిసి బండిపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయన భార్య తీవ్ర గాయాల పాలై మృతి చెందగా, నాగేశ్వరరావు చేతికి తీవ్ర గాయమై విరిగిపోయింది. అనంతరం శస్త్రచికిత్సలు నిర్వహించినప్పటికీ చేయి పూర్తిస్థాయిలో కోలుకోలేదు. భార్యను కోల్పోయి, ఇద్దరు చిన్నారుల బాధ్యతలతో పాటు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు.ఇటీవ ల ఈ కుటుంబం దయనీయ పరిస్థితిపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని రేపల్లెవాడ గ్రామానికి చెందిన పోతగాని పుల్లారావు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అల్లాడి సృజన్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న డాక్టర్ సృజన్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ అల్లాడి సృజన్ స్వయంగా రామకృష్ణాపురం గ్రామానికి చేరుకొని బాధితకుటుంబాన్ని పరామర్శించారు. మూడు నెలలకు సరిపడా బియ్యం, కందిపప్పు, పల్లీలు, సబ్బులు తదితర నిత్యావసర సరుకులను అందజేసి కుటుంబానికి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అల్లాడి సృజన్ మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా తనకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అలాగే నాగేశ్వరరావు చిన్న కుమారుడి విద్యాభ్యాసానికి కూడా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గండారపు రామారావు ఆర్ఎంపీ వైద్యులు, రేపల్లెవాడ గ్రామానికి చెందిన సామినేని ఫణీందర్, ప్రశాంత్, కళ్యాణ్‌తో పాటు రామకృష్ణాపురం గ్రామ యువకులు శీలం తనోజ్ తదితరులు పాల్గొన్నారు.








