Home Uncategorized రెండు జిల్లాలుగా విడిపోతున్న రంగారెడ్డి ?

రెండు జిల్లాలుగా విడిపోతున్న రంగారెడ్డి ?

41
0

రంగారెడ్డి ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్, జనవరి 2:

రంగారెడ్డి పరిధిలోని అర్బన్ రూరల్ జిల్లాలను విభజించే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది హైదరాబాద్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలను మార్చి వివరాలు సేకరించేందుకు జిహెచ్ఎంసిలో 27 పట్టణ స్థానిక సంస్థల ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి స్థానిక సంస్థలు అబ్దుల్లాపూర్ మండలం పై నిర్ణయం పెండింగులో ఉంది.

హైదరాబాదు మహానగర పాలక సంస్థను పునర్విభజించిన విధంగానే గ్రేటర్ పరిధిలోని జిల్లాలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నూతనంగా ఏర్పాటు అయినా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పునర్విభజన హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు జిల్లాల హద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొద్దిరోజుల క్రితం వరకు మూడు పోలీస్ కమిషనరేట్లు మూడు జిల్లాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి 4 పోలీస్ కమిషనర్లుగా మార్చిన నేపథ్యంలో మూడు జిల్లాల పరిధిని కూడా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. హైదరాబాద్ మల్కాజిగిరి జిల్లాల బౌండరీలను మార్చేందుకు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది నూతనంగా ఏర్పాటు అయిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది వీటికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో విడుదల కారునట్లు తెలియ వచ్చింది.

హైదరాబాద్ జిల్లాలో పలు మార్పులు చేర్పులు

హైదరాబాద్ జిల్లాలో పలుమార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి ప్రస్తుతం ఈ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి ఇందులో తిరుమలగిరి మారేడుపల్లి మండలాలను మల్కాజిగిరి జిల్లాలోకి మార్చనున్నట్లు తెలుస్తోంది అమీర్పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని మల్కాజిగిరి ప్రాంతంలో భాగం చేయనున్నారు హైదరాబాదు జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ బహుదూర్పుర ప్రస్తుతం ఉండగా ఇకపై రాజేంద్రనగర్ శంషాబాద్ మండలాలను విస్తరించనున్నారు. ఈ మండలాల్లో జిహెచ్ఎంసి (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ) పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే హైదరాబాదు జిల్లా పరిధిలోకి రానున్నట్లు తెలుస్తోంది.

అబ్దుల్లాపూర్ మెట్ మండలం గురించి నిర్ణయం పెండింగ్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉంది పునర్విభజన అనంతరం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా అంతవరకు విస్తరించినట్లుగా తెలుస్తోంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ సరూర్నగర్ మండలాలు విలీనం కానున్నాయి పునర్విభజన అనంతరం మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీనగర్ ( రంగారెడ్డి జిల్లా) కంటోన్మెంట్ ( హైదరాబాద్ జిల్లా ) శాసనసభ నియోజకవర్గాలు మేడ్చల్ జిల్లా పరిధిలోకి రానున్నాయి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మండలం ఉండగా అది జిహెచ్ఎంసి పరిధిలో దాటి ఉండటం వల్ల ఈ మండలం పై ఇంకా నిర్ణయం పెండింగ్లో ఉంది.

రంగారెడ్డి పరిధిలో అర్బన్ రూరల్ జిల్లాలుగా విభజించే ఆలోచన

రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం జిల్లా పరిధిలో పలు ఐటీ కంపెనీలు పరిశ్రమలు గేటెడ్ కమ్యూనిటీలు ఉండడం అర్బన్ రూరల్ జిల్లాలుగా విభజించినట్లుగా సమాచారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొత్తాన్ని అర్బన్ జిల్లాగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజిస్తున్నారు షాద్నగర్ శంషాబాద్ మండలం చేవెళ్ల ఆమనగల్ కేశంపేట తలకొండపల్లి మాడుగుల యాచారం మంచాల కందుకూరు మహేశ్వరం మండలాలను రూరల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. జనగణన (సెన్సెస్ ) 20 27 ఆధారంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా హౌసింగ్ సెన్సెస్ నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి చివరిలోపు పునర్విజన ప్రక్రియను చేపట్టనున్నామని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు మా ప్రతినిధికి తెలిపారు.

జిహెచ్ఎంసిలు 27 పట్టణ స్థానిక సంస్థలు

హైదరాబాద్ మహానగరం బృహత్ నగరంగా మారిందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి విస్తరణ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వారం రోజుల వ్యవధిలోనే మొత్తం తనతో పూర్తిచేస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు ( ఓ ఆర్ ఆర్ ) ఆనుకొని ఉన్న ఇరవై పొరపాలక సంఘాలు ఏడు నగరపాలక సంస్థలను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనితో హైదరాబాద్ మహానగర సరిహద్దులు అనేవి అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తాయి.