Home క్రైమ్ ప్రేమ వ్యవహారం.. మహిళ హత్య కేసు ఛేదన

ప్రేమ వ్యవహారం.. మహిళ హత్య కేసు ఛేదన

17
0
  • చున్నీతో గొంతు బిగించి హత్య చేసిన నిందితుడు అరెస్ట్
  • సెల్‌ఫోన్ సిగ్నల్‌తో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ఆర్గాన్ న్యూస్,మధిర, మే 20:

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం ఓపెన్ వెంచర్ ప్రాంతంలో ఈ నెల 15న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతురాలు గోపిశెట్టి కల్పన (28)గా గుర్తించారు.
దర్యాప్తులో యార్లగడ్డ అంకుశరావు @ చెన్నారావు అనే వ్యక్తి మృతురాలితో సన్నిహిత సంబంధం కొనసాగించినట్లు తేలింది. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, తమ సంబంధం విషయాన్ని తన భార్యకు చెబుతానని మృతురాలు హెచ్చరించడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కేసు నమోదు అనంతరం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు, సెల్‌ఫోన్ సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అంబరుపేట వెంచర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
వైరా ఏసీపీ సాదుల సారంగపాణి పర్యవేక్షణలో మధిర సీఐ డి . మధు , ఎస్ఐ బి . లక్ష్మీ భార్గవి మరియు సిబ్బంది సమర్థవంతంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు.