Home తెలంగాణ త్యాగం, పోరాటం, మేదో మధనం మేళవింపే రాష్ట్ర ఆవిర్భావం

త్యాగం, పోరాటం, మేదో మధనం మేళవింపే రాష్ట్ర ఆవిర్భావం

17
0

ఖమ్మం,ఆర్గాన్ న్యూస్, జూన్ 2:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్డ్ సంఘం ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్డ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.వి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు , న్యాయవాదులు , ఉద్యోగస్తులు , డాక్టర్లు , వివిధ ప్రజా సంఘాలు మరియు తెలంగాణకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు పోరాటం చేస్తే గాని ఈరోజు తెలంగాణ రాలేదు . మేధావుల యొక్క మేధో మదనం తెలంగాణ రాష్ట్ర సాధనకు చాలా దోహదపడిందని అన్నారు . ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతం తెలంగాణ సాధనకు మూలం . స్వరాష్ట్రం కోసం 1969 నుండి 2014 వరకు తెలంగాణ ఆత్మ గౌరవం కొరకు ,నీళ్ళు,నిధులు , నియమకాల కొరకు అలుపెరగని పోరాటం చేస్తే గాని ఈ తెలంగాణ ఏర్పడలేదు . తొలి ఉద్యమంలో 369 మంది , మలిదశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే కానీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాలేదు . అంటే దాని అర్థం ఏమిటంటే త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ ఏర్పడిందని ,పోరాటాల పురిటి గడ్డ అయినటువంటి తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల వల్ల సిద్ధించింది . ప్రధమ ఉద్యమకారుడైన ప్రకాష్ కుమార్ జైన్ ఖమ్మం గార్లవాసి , మలిదశలో ఉద్యమకారులు శ్రీకాంత్ చారి , ఇషన్ రెడ్డి , యాదన్న , యాది రెడ్డి , ఠను నాయక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల సోనియాగాంధీ తీవ్రమైన మనస్థాపనకు గురై తెలంగాణను ప్రకటించింది . తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం . తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్య , తవిడి శెట్టి రామారావు , గుంతేటి వీరభద్రం , పగడాల నరేందర్ , బచ్చల పద్మాచారి , నెలవెల్లి వెంకటేశ్వరావు , షేక్ అబ్బాస్ , బత్తిన మధుగౌడ్ , లింగనబోయిన సతీష్ , రవిచంద్ర చౌహాన్ , దేవిరెడ్డి విజయ్ , బాలిన భాస్కర్ రెడ్డి , దరిపల్లి వీరబాబు , మోత్కురి వేంకటేశ్వరా చారి , భుక్య శ్రీనివాస్ నాయక్ , దరిపల్లి వీరబాబు , గోవిందు , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , కోడిరెక్క ఉమాశంకర్ , గాజుల రవి కుమార్ , ఆసిఫ్ , బురాన్ , కోటేశ్ యాదవ్ , బాసాటి హనుమంతరావు , రెడ్డబోయిన వరలక్ష్మి , గ్లోరి , కమలమ్మ , ధనలక్ష్మి , స్వరూప , కోసూరి వీరబాబు , పగడాల నాగరాజు , పగడాల శీను ,గాలి రాము , ఇనుప శీను , లంజేపల్లి బాబు , నార్పొంగు వెంకట్ , పరికపెళ్లి ఎల్లయ్య ,ఎస్ కే యాకూబ్ , సుందర్రావు తదితరులు పాల్గొన్నారు .