Home POLITICS ఇంటి పన్ను తగ్గింపుకు తన వంతు కృషి చేస్తా

ఇంటి పన్ను తగ్గింపుకు తన వంతు కృషి చేస్తా

5
0
  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 13: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో అధికంగా ఉన్న ఇంటి పన్నులను తగ్గించడానికి తన వంతు కృషి చేస్తానని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శాసనసభ వ్యవహారాలు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లెల్ల కూడా మాజీ ఉపసర్పంచ్ సీనియర్ నాయకులు, మేకల రవీందర్ రెడ్డి మంత్రిని కలిసిన ఫోటోలను, సోమవారం నాడు విడుదల చేశారు. భారీగా ఉన్న ఇంటి పన్నులను సవరింప చేయడానికి ముందుకు వచ్చి కాలనీ సంక్షేమ సంఘాలు కాలనీవాసులు అందరితో కలిసి ఇటీవల వంగా అనంతరెడ్డి గార్డెన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసిన విషయం పాఠకులకు విధితమే ఈ నేపథ్యంలో మేకల రవీందర్ రెడ్డి, మాట్లాడుతూ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను మంత్రికి వివరించడం జరిగిందని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ తదితర సంపన్న ప్రాంతాల కంటే ఎక్కువగా మీర్ పేట కార్పొరేషన్ కాలనీలలో పన్నులు ఉన్నాయని వివరించానని తెలిపారు. దీనితో స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు పెరిగివున్న పనులను తగ్గింపుకు సహకారం అందజేస్తామని స్పష్టం చేశారని ఈ నేపథ్యంలో ఏహెచ్ఎంసి బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ సర్కిల్ కు పనులు తగ్గించే విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం మేకల రవీందర్ రెడ్డి బృందం సోమవారం డిసి ని కలిసే ప్రయత్నం చేస్తోంది అయితే తమ వినతికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబుకు రవీందర్ రెడ్డి కాలనీ సంఘాల అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీల అధ్యక్షులు దుర్గా దాస్ గౌడ్, అశోక్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి సుకుమార్ ఎస్ ఎల్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.