Home క్రైమ్ 7కేజీల గంజాయి పట్టివేత

7కేజీల గంజాయి పట్టివేత

19
0

మణుగూరు, కొత్తగూడెం
ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 10:

మొండికుంట టూ అశ్వాపురం మార్గం లో ద్విచక్ర వాహనం పై తరలిస్తున్న 7 కేజీ ల గంజాయి తరలిస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్నారు.
ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ ఐ సీహెచ్.శ్రీహరిరావు, సిబ్బంది కలిసి మొండికుంట నుంచి అశ్వాపురం వెళ్ళే దారిలో కేవీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనం ను ఆపి తనిఖీ చేయగా దానిలో 7 kg ల ఎండు గంజాయి లభ్యమైంది.

గంజాయి ని తరలిస్తున్న కేసులో ఏ 1) బడేటి వెంకటేష్ తండ్రి క్రిష్ణ నివాసం తెల్లబెల్లి (సూర్యాపేట జిల్లా),
ఏ 2) మోరుబోయిన గోపయ్య తండ్రి నాగరాజు నివాసం వెంగనాయకునిపాలెం(కృష్ణా జిల్లా) ఏపీ లు ఒడిశా రాష్టం లోని మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ కు తరలిస్తూ పట్టుబడినారు.
తదుపరి విచారణ నిమిత్తం ఇట్టి గంజాయిని,1 ద్విచక్ర వాహనం ,1 సెల్ ఫోన్ మరియు ఇద్దరు ముద్దాయిలను ( వీటి మొత్తం విలువ రూ.4,60,000) మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించడమైనది..
ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ యంఏ కరీం కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, వీరబాబు లు పాల్గొన్నారు.
గంజాయిని పట్టుకున్న టీం ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ,ఈఎస్ కే.తిరుపతి అభినందించారు.