- రోడ్డు భద్రతపై పోలీసుల కసరత్తు.
- అరైవ్ అలైవ్ కార్యక్రమంతో అవగాహన పెంపు
బోనకల్,ఆర్గాన్ న్యూస్ మార్చి 30 :
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యవసరమని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. బోనకల్ పోలీస్ స్టేషన్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నిర్వహించిన “అరైవ్ అలైవ్” ప్రత్యేక కార్యక్రమంలో మధిర రూరల్ సీఐ మధు బోనకల్ ఎస్ఐ పొదిలి వెంకన్నతో కలిసి ఆయన పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచులు, వైస్ సర్పంచులు, స్థానిక ప్రజలకు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ప్రాముఖ్యతను వివరించారు. సురక్షితంగా గమ్యం చేరడం, ప్రాణాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ప్రతి ప్రయాణంలో జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణ నష్టం తగ్గుతుందని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు వైస్ సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








