Home ఎడ్యుకేషన్ పదవ తరగతి పరీక్షల్లో బోనకల్ విద్యార్థి ప్రతిభ

పదవ తరగతి పరీక్షల్లో బోనకల్ విద్యార్థి ప్రతిభ

29
0

బోనకల్, ఆర్గాన్ న్యూస్ ఏప్రిల్ 16:

బోనకల్ గ్రామానికి చెందిన కొణతాలపల్లి నాగేశ్వరరావు, కృష్ణవేణిల కుమారుడు కొణతాలపల్లి పార్ధ సాయి అన్వేష్ సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చాడు. ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్‌లో చదువుతున్న అతడు 500 మార్కులకు గాను 467 మార్కులు సాధించాడు.
ఈ విజయానికి పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల సహకారం ముఖ్యమని అన్వేష్ తెలిపాడు. విద్యార్థి విజయంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. తోటి మిత్రులు, బంధువులతో కలిసి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.