- పారిశ్రామిక ప్రాంత మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకరరావు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 13: పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో వందల కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూల్చి వేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పారిశ్రామిక ప్రాంత మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్య రాత్రి జెసిబి, ఇటాచి, వాహనాలను తీసుకువచ్చి కొంతమంది భూకబ్జాదారులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూల్చివేశారని ఈ కూల్చివేతపై మేధావుల ఫోరం కన్వీనర్ గా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల భూకబ్జాకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వందల కోట్ల రూపాయల భూ అక్రణ జరుగుతున్న భూ ఆక్రమణపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెదవిప్పి ఏకమై అట్టి ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ వద్ద వందల కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ పరిధిలో వందల కోట్ల రూపాయలు సి ఎస్ ఆర్ నిధులు ఉన్నాయని, ఆ సి ఎస్ ఆర్ నిధుల నుండి 100 కోట్ల రూపాయలను విడుదల చేసి అత్యాధునిక సౌకర్యాలతో తిరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించాలని ఆయన కోరారు. కోట్ల విలువ చేసే ఈ భూమిపై కొంతమంది రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని వారి బండారం కూడా త్వరలోనే బయటపెడతానని ఆయన అన్నారు. ఇట్టి ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అధికారులపై ఎంతో ఉందని అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లా కలెక్టర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూల్చివేసామని కలెక్టర్ అనడం వెనక ఎంతో గూడుపుఠాణి దాగి ఉందని ఈ విషయమై కలెక్టర్ నిజాయితీని కూడా శంకించాల్సీ వస్తుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారుల నుంచి నికార్స్ అయినా సమాచారాన్ని తెప్పించుకొని వెంటనే ఈ భూకబ్జాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి 100 కోట్ల సి ఎస్ ఆర్ రూపాయలను విడుదల చేసి అత్యాధునిక పాఠశాల నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, జిల్లా కలెక్టర్ కృషి చేయాలని అందుకు అధికారులు సహకరించాలని ఆయన కోరారు. గతంలో డాక్టర్ కిషన్ రావు ఈ ప్రాంతంలో కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తన వంతు పాత్ర ఎంతో ఉందని, అదేవిధంగా సి ఎస్ ఆర్ నిధులు తెప్పించడంలో కూడా ఒక సీనియర్ జర్నలిస్టుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృ ద్ధికి 40 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నానని, భూ కబ్జాదారులు ఎంతటి వారైనా రాత్రి కిరాత్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూల్చివేయడం దురదృష్టకరమని తక్షణమే సిసి ఫుటేజీని పరిశీలించి భూకబ్జాదారులను కఠినంగా శిక్షించి ప్రభుత్వ భూములను కాపాడి అట్టి భూమిలో అత్యాధునిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి తక్షణమే కృషి చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునివ్వవలసి వస్తుందని కస్బా శంకర్రావు హెచ్చరించారు.


