Home ఎడ్యుకేషన్ “ప్రైవేట్ స్కూల్ వద్దు… ప్రభుత్వ బడి ముద్దు”

“ప్రైవేట్ స్కూల్ వద్దు… ప్రభుత్వ బడి ముద్దు”

25
0
  • కుక్కునూరులో యుటిఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఇంటింటా చైతన్యం
  • ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
  • బడి బాట కార్యక్రమంలో ఉపాధ్యాయుల పిలుపు

కుక్కునూరు, ఏప్రిల్ 16:

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో “ప్రైవేట్ స్కూల్ వద్దు… ప్రభుత్వ బడి ముద్దు” అనే నినాదంతో కుక్కునూరు మండల కేంద్రంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చైతన్యం కల్పించడం ముఖ్య ఉద్దేశమని జిల్లా కార్యదర్శి బి. బాలకృష్ణ తెలిపారు.
మండలంలోని యుటిఎఫ్ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతను వివరించారు. గ్రామ గ్రామాన తిరుగుతూ కరపత్రాలు పంచుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పథకాలు, సౌకర్యాలు, నాణ్యమైన బోధన గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా మండల యుటిఎఫ్ అధ్యక్షుడు వాంకుడోత్ నాగేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ విద్య అందిస్తున్నామని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి మంచి స్పందన తెలిపినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎర్రబోరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సరిత, నీలిమ, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.