- భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్, కొలను శంకర్ రెడ్డి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చ్ 10: గత ప్రభుత్వం బిఆర్ఎస్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసి ప్రక్షాళన ఏటీఎం గా మారిందని, అవినీతి మరింత పెరిగిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సింగిల్ మిండోచైర్మన్ కొలను శంకర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా ప్రకటించి భాగ్యనగర్ హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి చెందుతుందని మూడు కార్పొరేషన్లు అభివృద్ధికి నోచుకోలేదని మహానగరంలో విలీనం చేయడం అంటే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగర్ హిందువుల మనోభావాలను కాపాడాలని ఈ కార్పొరేషన్ లో ఏర్పాటును పునః పరిశీలించాలని బిజెపి డిమాండ్ చేస్తుందని అన్నారు. మూడు కార్పొరేషన్లను విలీనం చేయడంతో రంగారెడ్డి జిల్లా పేరు ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిందని, దీనిపై ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల హామీలు ఏమైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలను ఆకర్షితులను చేసి అధికారాన్ని అప్పజెప్పితే ఆరు గ్యారెంటీలకు అతీగతీ లేకుండా పోయిందని, ఆరోపించారు. ప్రజల యొక్క ఆలోచనలు మూడు కార్పొరేషన్లు తెరపైకి తేవడం దురదృష్టకరమని అన్నారు గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ మరింత అవినీతికి పాల్పడుతూ మూసి ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కప్పం కట్టేందుకు తహతహలాడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గాలి మాటలు చెబుతున్న కాంగ్రెస్పై ప్రజలు తిరగబడే రోజు వచ్చిందని వేలాదిమంది ప్రజల ఇండ్లను కూల్చడంతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఇందిరమ్మ రాజ్యం సోనియా రాజ్యం రాహుల్ రాజ్యం అని ఒక విధానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన కొనసాగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో రామరాజ్యం తెస్తామని అంటే రేవంత్ రెడ్డి మాత్రం ఇందిరమ్మ రాజ్యం సోనియా రాజ్యం రాహుల్ రాజ్యం అని భజన చేస్తున్నారని, రేవంత్ రెడ్డి తన ప్రవర్తనను ఇలాగే కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు మూసి ప్రక్షాళన కాలేశ్వరం మిషన్ భగీరథ పేరుతో చేసిన అవినీతిపై బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని భారత రాష్ట్ర సమితి కి గతంలో అసెంబ్లీ లో మెజార్టీ రాకుండా పార్లమెంటులో ఒక్క సీటు గెలవకుండా బుద్ధి చెప్పినా ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని, ఆ పార్టీ కోవలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారని ఆ పార్టీకి కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని కొలను శంకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.








