- మేడారం జాతరలో 5వ బెటాలియన్ ఎస్ డి ఆర్ ఎఫ్ సాహస రక్షణతో.. ముగ్గురు సురక్షితం
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, జనవరి 23:
తెలంగాణ అతిపెద్ద జాతర మేడారంలో జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా జరిగిన ప్రమాదంలో మునిగిపోతున్న ముగ్గురిని ఎస్ డీ ఆర్ ఎఫ్ రాష్ట్ర విపత్తు స్పందన దళం 5వ బెటాలియన్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ పోలీస్ సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు.జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరించడానికి వచ్చిన భూపాలపల్లి
వాసులు మేకల జంపయ్య (36), మేకల సరిత( 14) మేకల శిరీష (13) ముగ్గురు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది కానిస్టేబుల్ లు రాందాస్ ప్రవీణ్ రాజశేఖర్ రవి రాజు హరీష్ తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి నీటిలోకి దిగి మునిగిపోతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.రక్షించబడిన వారి కుటుంబ సభ్యులు ఎస్ డి ఆర్ ఎఫ్ రక్షక బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు.మేడారం జాతర వంటి మహా ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజల ప్రాణ భద్రత కోసం ఎస్ డి ఆర్ ఎఫ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుందని ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం పేరుకొన్నారు అలాగే తన ప్రాణాలు సైతం తెగించి భక్తులను కాపాడినటువంటి సిబ్బందికి కమాండెంట్ అభినందనలు తెలియజేశారు.ఎస్ డి ఆర్ ఎఫ్ 5వ బెటాలియన్ సిబ్బంది సేవలు ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నాయి.


