ఖమ్మం త్రీ టౌన్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 16:
ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో గల వరప్రదాత షిరిడి సాయి మందిరం 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షిరిడి సంస్థాన్ సీఈవో గోరక్ష ఘడిల్ఖర్ బాబా వారి అక్షయపాత్ర విగ్రహాన్ని ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు ముఖ్య దేవాలయ చైర్మన్ లను సాయి మందిర చైర్మన్ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఘనంగా సన్మానించారు . అదేవిధంగా 63 మంది వేద బ్రాహ్మణులకు 1500 రూపాయల విలువ గల నిత్య అవసర సామగ్రిత్తో పాటు , సంభావనతో బ్రాహ్మణులనుఘనంగా సత్కరించారు . సీఈవో చేతుల మీదుగా షిరిడి సాయి మందిర అధ్యక్షులు డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు . ఈ కార్యక్రమంలో గుండా వీరేంద్రదాస్ రేణుక దంపతులు, దిల్షుక్ నగర సాయిబాబా మందిర మాజీ అధ్యక్షులు మల్లయ్య , అరవపల్లి నిరంజన్ , పివిడి ప్రసాద్ , కురువేల్ల జగన్మోహన్ రావు , డాక్టర్ వేములపల్లి నరేష్ , వేములపల్లి శ్రీనివాసరావు , వేములపల్లి నగేష్ , గన్నవరపు నాగేశ్వరరావు , మోదుకూరి శ్రీధర్ , కుసుమ శ్రీనివాస్ , శీలం హనుమంతరావు , బోనగిరి ఉమేష్ , విష్ణు పారాయణ మహిళా భక్తులు, సాయి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 1500 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు .


