- విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, సీట్ల పంపిణీ
- సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని ‘దేశ ప్రేమ్ దివస్’గా పాటిద్దాం
- ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ హుజురాబాద్, ఆర్గాన్ న్యూస్, జనవరి 23:
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత దేశభక్తుడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, సీట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొలుగూరి సూర్యకిరణ్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యానికి ముప్పుగా నిలిచిన నేతాజీ, పదకొండు సార్లు ఆంగ్లేయుల చేత జైలులో బంధించబడ్డా పోరాట పటిమను వీడలేదన్నారు.
“స్వాతంత్రం ఇచ్చేది కాదు… తీసుకునేది” అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన నేతాజీ, “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను” అని నినదించారని చెప్పారు.
నేతాజీ పోరాట పటిమ దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజల కోసం, దేశం కోసం నేతాజీ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆయన ఆశయాల మేరకు పనిచేస్తోందని తెలిపారు.
జననం తప్ప మరణం లేని ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సాయి తేజ, రాజేష్, సాత్విక్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.








