Home సినిమా ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా’ని అందరూ చూసి హిట్ చేయండి.. సిటీ కమిషనర్ సజ్జనార్…ఫిలింనగర్...

ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా’ని అందరూ చూసి హిట్ చేయండి.. సిటీ కమిషనర్ సజ్జనార్…ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (జనవరి 24)

19
0

శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో..

సిటీ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ ..
‘మన జీవితంలో చాయ్ అనేది ఎంతో ముఖ్యమైనదిగా మారింది. ఈ ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. శివ కందుకూరి లాంటి యంగ్ హీరో, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో నటించారు. నీలోఫర్ బాబుగారు అందరికీ స్పూర్తి. ఆయన ఈ మూవీని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఫిబ్రవరి 6న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ మూవీని చూసి హిట్ చేసి, యంగ్ టీంని ఆశీర్వదించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది’ అని అన్నారు.
నీలోఫర్ ఫౌండర్ బాబురావు మాట్లాడుతూ .. ‘నేను చాయ్‌తోనే ఈ స్థాయికి వచ్చాను. ఈ ‘చాయ్ వాలా’ కార్యక్రమానికి నన్ను పిలవడం ఆనందంగా ఉంది. చాయ్ అంటే అందరికీ ఓ ఎమోషన్. చాయ్ వాలా అనే పేరు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారు. ఈ చాయ్ వాలా మూవీతో టీం అందరికీ మంచి గుర్తింపు రావాలి. సజ్జనార్ గారి హస్తవాసి చాలా మంచిది. ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.