Home తెలంగాణ నేడు అలైడ్ ఆడిటోరియంలో సంగీత విభావరి

నేడు అలైడ్ ఆడిటోరియంలో సంగీత విభావరి

31
0
  • ఇళయరాజా సంగీతానికి 50 సంవత్సరాల ప్రస్థానం పూర్తయిన నేపథ్యంలో సినీ సంగీత విభావరి
  • శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు గొర్తి చంద్రశేఖర్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 27: శ్రీరామ యువరాగం ఆర్ట్ థియేటర్స్, శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ అభినందనలతో డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం, ప్రాణ స్నేహితులు పద్మవిభూషణ్ ఇళయరాజా సినీ సంగీత ప్రస్తానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజాధిరాజాదిరాజా సినీ సంగీత విభావరి శనివారం సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియం రెండవ అంతస్తు శ్రీ వాసవి శ్రీముఖి కాంప్లెక్స్ హిమాయత్ నగర్ లో నిర్వహిస్తున్నట్లు శ్రీరామ సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గొర్తి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీ వేత్త జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకట్ గరికపాటి, గౌరవ అతిథులుగా ప్రముఖ గాయకులు కాండ్రేగుల కృష్ణారావు, లైఫ్ కోచ్ మోటివేషన్ స్పీకర్ తనికెళ్ల రామకృష్ణ, గౌరవ అతిథులుగా, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు సంగీత దర్శకులు డాక్టర్ కోమండూరి రామాచారి, నంది అవార్డు గ్రహీత సినీ నేపధ్య గాయకులు వినోద్ బాబు, సినీ నేపధ్య గాయకులు సంగీత దర్శకులు డాక్టర్ జి బంటి, సినీ నేపథ్య గాయకులు వేణు శ్రీరంగం హాజరవుతారని ఈ కార్యక్రమంలో నగరంలో నిష్ణాతులైన నేపధ్య గాయనీ గాయకులు ఇళయరాజా సంగీతం చేకూర్చిన పాటలు తమ గళాలతో వినిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రావ్య స్వర రంజని వ్యవస్థాపకురాలు శశికళ స్వామి, సింగిగ్ స్టార్ విజయలక్ష్మి, మెలోడీ క్వీన్ నంది అవార్డు గ్రహీత సురేఖ మూర్తి దివాకర్ల, గాన సరస్వతి అఖిల, గాన కళాకౌస్తుభా ఎన్ లలిత, మధుర గానమైయుఖ రేణుక రమేష్, ప్రముఖ గాయని మా ఈవెంట్స్ అధినేత శ్రీదేవి, ప్రముఖ గాయని నల్లూరి శ్రావ్య శృతి, సీలం శేఖర్, పవన్ ఉమాపతి, శ్రీకాంత్ సిలువేరు, సూర్య, సుజాత పెదిరెడ్ల, లక్ష్మీ గాయత్రి కేశవ్, అభిఖ్యా తనికెళ్ళ , సంధ్య ఉమాపతి, డాక్టర్ మురళీమోహన్, సంతోష్ పిట్ల, రామ వెంకట భరత్ కుమార్ వేమూరి, ఎస్ కమల్ కిషోర్, ప్రజ్ఞా కాసోజు, చందన ఆనం బొట్ల, మోహనాస్వారంగి, కే సింధు చరిత, వెంకటేష్, ది మంత్ కాట్రావులపల్లి, టీ ప్రణవ్ సాయి కౌశిక్, కోరేడె శృతి, శ్రీధరం క్రాంతి నీరజ, కమలా గాయత్రి, ముగ్దా అదేపల్లి, ప్రజ్ఞ అలంకృత పులిపాక, జ్యోతి, చేపూరి శ్రేయ, గారి పల్లి ప్రణతి గుప్తా, యశ్వగ్నికా జొన్నలగడ్డ, శ్రీమయి ఓరుగంటి, పి శ్రీరమణి, సాహితీ వాచస్పతి, ఘంటసాల తనివి మంజుల, కసి వజ్జల హర్షిణి, కోట సదానందిని , కే శ్రీష సాయి, ప్రజ్ఞాన్ పార్థివ్ నిష్టల, హరిణి,, కొమిరిశెట్టి అనిక, అక్షర భమడిపాటి, అక్షర, ఏ సాయి విశేష్, తమ గళాలతో సంగీత సినీ విభావరిని ప్రేక్షకులకు అందిస్తారని కార్యక్రమంలో సమన్వయకర్తగా రవికుమార్ వ్యవహరిస్తారని, కార్యక్రమం అసాంతం ఫోటోగ్రఫీ జై లక్ష్మీ నరసయ్య నిర్వహిస్తారని, కార్యక్రమ వ్యాఖ్యాతగా ప్రముఖ గాయని యోగితా అక్కిరాజు వ్యవహరిస్తారని చంద్రశేఖర్ గొర్ర్తి తెలిపారు. సినిమా అభిమానులు ఎస్పీ బాలు, ఇళయరాజా అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెందూ కోరారు.