భారతీయ జనతా పార్టీ బడంగ్ పేట అధ్యక్షులు రామిడి వీర కర్ణ రెడ్డి
రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, జనవరి 5:
బడంగ్ పేట సర్కిల్ నాదర్గుల్ డివిజన్లోని అల్మాస్గూడ అంబేద్కర్ విగ్రహం దగ్గర గత ఆరు నెలలుగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీ గతంలో బడంగ్ పేట మున్సిపల్ కార్యాలయంలో పార్టీలకు అతీతంగా దాదాపు అన్ని కాలనీల వారు సమస్య గురించి వివరించడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం జరగలేదని బడంగ్ పేట భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామిడి వీర కర్ణ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ గతంలో ఇక్కడ పర్యటించిన కమిషనర్ ఇతర అధికారులు ఆగమేఘాల మీద వచ్చే సమస్యపై ఒకటి రెండు రోజుల్లో తాత్కాలిక పరిష్కారం మాత్రమే చేశారని తప్పించి దానికి శాశ్వత పరిష్కారం అనేది అధికారులు కనుక్కోలేకపోయారని, విమర్శించారు, ఇది అధికారుల లోపమా లేక సమస్య పట్టనట్లు వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు.
వస్తారు, చూస్తారు, వెళతారు,
అల్మాస్గూడ అంబేద్కర్ విగ్రహ రహదారి నుండి ప్రతిరోజూ చిన్నారులు, విద్యార్థులు వ్యాపారస్తులు అక్కడే కూరగాయలు అమ్ముకునే వారు ఎంతోమంది ఈ రహదారిపై ఇబ్బందులు పడుతున్నారని ఒకసారి, అధికారులు దీనిపై ఆలోచన చేయాలని ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది కానీ అధికారులకు అది పట్టడం లేదని విమర్శించారు. వస్తారు చూస్తారు వెళ్తారు అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది తప్ప పరిష్కారం అయ్యే మార్గం కనిపించడం లేదని దీనిని రెండు మూడు రోజుల్లో శాశ్వత పరిష్కారం కనుక చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ చుట్టుముట్టు ఉన్న అన్ని కాలనీలా సహకారంతో సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా రావిడి వీర కర్ణ రెడ్డి హెచ్చరించారు.








