Home తెలంగాణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న” రాజాధి రాజాధి రాజా” సంగీత విభావరి

ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న” రాజాధి రాజాధి రాజా” సంగీత విభావరి

21
0

రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 30:

శ్రీరామ యువరాగం ఆర్ట్స్ థియేటర్ సమర్పించిన శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ అభినందనలతో డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ప్రాణ స్నేహితులు పద్మ విభూషణ్ ఇళయరాజా సినీ సంగీత ప్రస్థానానికి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో శ్రీరామ సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గొర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో హిమాయత్ నగర్ లోని అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. బాల గాయకుల నుండి యువ గాయకుల వరకు తమ గళాలను వినిపించి “భళా” అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు కాండ్రేగుల కృష్ణారావు, తనికెళ్ల రామకృష్ణ, సినీ నేపథ్య గాయకులు సంగీత దర్శకుడు డాక్టర్ బంటి, వారి సోదరి అలకానంద చిన్నారులను ఆశీర్వదించడమే కాక తనంతవారు కావాలని ఆకాంక్షించారు సినీ నేపథ్య గాయకులు వేణు శ్రీరంగం, కూడా పాల్గొని చిరంజీవులు అద్భుతంగా పాడుతున్నారని వారిని ఆశీర్వదించారు శ్రావ్య స్వర రంజని శ్రీమతి శశికళ, సింగిల్ స్టార్ శ్రీమతి విజయలక్ష్మి, మెలోడీ క్వీన్ నంది అవార్డు గ్రహీత సురేఖ మూర్తి, అఖిల, గాన కళా కౌస్తుభవ్యాఖ్యాత లలిత, మధుర గాన మయూఖ రేణుక రమేష్, అందాల గాయని మా ఈవెంట్స్ అధినేత శ్రీదేవి, నల్లూరి శ్రావ్య శృతి ప్రముఖ గాయకులు శీలం కిషోర్, పవన్ ఉమాపతి, చిలువేరు శ్రీకాంత్, సూర్య, అబిక్య, సంధ్య ఉమాపతి డాక్టర్ మురళీమోహన్, సంతోష్, వెంకట భరత్ వేమూరి, కమల్ కిషోర్, ప్రజ్ఞా కాసోజు, శ్రీ చందన, మోహనా స్వరాంగి, సింధు చరిత, వెంకటేష్ (వెంకి ) ది మంత్ కాట్రావుల టీ ప్రణయ్ కౌశిక్ శృతి, క్రాంతి నీరజ, కమలా గాయత్రి, ముక్త అద్దేపల్లి, ప్రజ్ఞ అలంకృత జ్యోతి, చేపూరి శ్రేయ ప్రణతి గుప్తా యశ్వగ్నిక జొన్నలగడ్డ, శ్రీ మయి ఓరుగంటి పీ శ్రీ రమణి , సాహితీ వాచస్పతి, ఘంటసాల తన్వి మంజుల హర్షిణి, కోటా సుదానందిని శ్రీశ సాయి చిరంజీవి ప్రజ్ఞాన్ ప్రార్ధవి నిశ్చల హరిణి కొమిరిశెట్టి అనేక, అక్షర, సాయి తదితరులు తమ గానాలను వినిపించారు, ఈ కార్యక్రమంలో జానవులే నెరజాణవులే, బాటనీ పాఠముంది, సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది ప్రియతమా నన్ను పలకరించు, ఏకాంత వేళలో, ఒళ్లంతా కవింత కావాలిలే, అనే పాటలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.