Home తెలంగాణ గోవా టూర్ కు హైదరాబాదు-2 డిపో బస్సు ఏర్పాటు

గోవా టూర్ కు హైదరాబాదు-2 డిపో బస్సు ఏర్పాటు

15
0
  • హైదరాబాద్ 2 డిపో మేనేజర్ ఎం. కరుణ శ్రీ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 17: భక్తుల సౌకర్యార్థం ఈనెల 20వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ నుండి హైదరాబాదు -2 డిపో గోవా టూర్ నిర్వహిస్తుందని హైదరాబాద్ 2 డిపో మేనేజర్ ఎం కరుణశ్రీ తెలిపారు. ఆమె మంగళవారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ 20వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు దిల్సుఖ్నగర్ నుండి బయలుదేరి హంపి, కుక్కి, ధర్మస్థలి, ఉడిపిలో రాత్రి హాల్టిచేసుకుని ఉడిపి నుండి ఉదయం 4 గంటలకు బయలుదేరి మురుడేశ్వర్ ఉదయం ఆరు గంటలకు చేరుకొని దర్శనం అనంతరం అక్కడి నుండి 12 గంటలకు బయలుదేరి గోకర్ణ ఒంటిగంట 30 నిమిషాలకు చేరుకొని దర్శన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు బస్సు గోవాలో హాల్టి చేస్తుందని మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలకు గోవా నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు దిల్సుఖ్నగర్ చేరుతుందని తెలిపారు. ఒకరికి టికెట్టు 5000 రూపాయలు ఛార్జి చేస్తున్నామని ఆసక్తి గలవారు సర్వీస్ నెంబర్ 98998 కి ఆన్లైన్లో సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చని వివరాలకు,9959444165 లేదా9666350995, లేదా7382838010 లలో సంప్రదించవచ్చునని కరుణశ్రీ తెలిపారు.