Home POLITICS రెండు సంవత్సరాల తర్వాత ప్రజలు ఎవరిని బహిష్కరిస్తారో చూద్దాం

రెండు సంవత్సరాల తర్వాత ప్రజలు ఎవరిని బహిష్కరిస్తారో చూద్దాం

17
0
  • మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ మార్చ్ 30: సాంఘిక బహిష్కరణ అనే పదం ఈమధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుండి పదేపదే వినపడుతుందని సాంఘిక బహిష్కరణ చేయవలసి వస్తే రెండు సంవత్సరాల తరువాత ప్రజలు మిమ్మలనే బహిష్కరిస్తారని రాష్ట్ర మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మరో రెండున్నర సంవత్సరాలు ఆగండి రాష్ట్రంలో మిమ్మల్ని బహిష్కరించకపోతే చూడండి అని అన్నారు అధికారం ఉంది అనే అహంకారంతో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదు, అటు సూర్యుడు ఇటూ ఉదయించిన ఇటు సూర్యుడు అటు ఉదయించిన ఆరు నూరైనా మేము చేస్తున్నదే వినాలి అనే ధోరణితో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని అన్నారు. శాసనసభలో సూటిగా అడిగితే సమాధానం ఉండదని ఎంతసేపు పది సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని భారత రాష్ట్ర సమితిని హెచ్చరిస్తున్నారు కానీ, మేము చేసిన అభివృద్ధిని చెప్పుకుందామంటే అవకాశం ఇవ్వడం లేదని ఇప్పుడు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నారు రెండున్నర సంవత్సరాలలో మీరు ఏం చేశారు అని ప్రశ్నించారు.