- హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాస్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 17: నేటి బాలలే రేపటి పౌరులు అన్నది ఒకప్పటి నినాదం కానీ నేటి చిన్నారులే రేపటి బాల కార్మికులు అని ఇప్పటి నినాదం నగ్న సత్యం కూడా అని బాలల భవితకు బంగారు బాటలు వేసేందుకు మన తరం కృషి చేయవలసిన అవసరం ఉందని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి, డాక్టర్ ఏ.ఎస్. శ్రీనివాస్ అన్నారు. బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఇటీవల జరుపుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలక, బలపం, పట్టాల్సిన చేతులు గునపంతో రాళ్లు తవ్వుతున్నాయని బడికి వెళ్ళవలసిన బతుకులు బొగ్గు గనులలో మసి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పుస్తకాలు మోయవలసిన చిన్నారులు బతుకు బారాన్ని మోస్తున్నారని ఇష్టమున్న లేకున్నా బాల కూలీలుగా మారవలసి వస్తుందని పంట పొలాలలో పనిచేస్తూ కూలీల పాత్ర పోషిస్తున్న చిన్నారులు బంగారు భవిష్యత్తును ఫణంగా పెడుతున్నారని ఏ పొలంలో ఏ ఫ్యాక్టరీలో చూసినా పనులు చేస్తున్న బాలలే దర్శనమిస్తున్నారని ఇంకా సలసల కాగే సున్నపు బట్టీలు ఊపిరాడని వీటి మధ్య బాల కార్మికులు మగ్గిపోతున్నారని అన్నారు. అధికారుల అలసత్వం యజమానుల కర్కషత్వానికి బలైపోతున్న బాల్యం ఆడి పాడే వయస్సు పలక బలపంతో సహవాసం బుడిబుడి అడుగులు వచ్చేరాని మాటలు ఇక్కడ అవేవీ బాల కార్మికులకు కనిపించవని అంతా బంధిఖానా పొగ చూరిన జీవితాలే అని భవిష్యత్తు అంతా అంధకార బంధురమని వందలాది పరిశ్రమల్లో సమిదలవుతున్న బాలలు వీరి సమయం అంతా దుమ్ము దూళికే పరిమితం అవుతుందని బడి అన్న ఊసే లేదని ఆటపాటల ధ్యాస అసలే రానివ్వరని లేత వయసుతో గంపెడు భారం మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల నేరమా? ప్రభుత్వ వైఫల్యమా? ఎందుకిలా జరుగుతుంది తల్లిదండ్రుల నేరమా ప్రభుత్వం విఫల్యం అని ప్రశ్నించారు పిల్లలను బడికి పంపించాలన్న ఆశ ఉన్నప్పటికీ రికార్డితే కాని డొక్కాడని బతుకులతో ఇది సాధ్యం కావడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారని పెరుగుతున్న ఆర్థిక అసమానతలు పాలకుల తీరు వీటికి బలం చేకూరుస్తున్నాయని దేశంలో 40 శాతం మంది 18 ఏళ్ల లోపు వారు ఉంటే అందులో 23% బాల కార్మికులే ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు 1956లో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా ఒక రోజున కేటాయించిందని వేసవి సెలవుల అనంతరం పాఠశాలను ప్రారంభిస్తారు కాబట్టి దీనికి దగ్గరలో ఉండేలా జూన్ 12న బాల కార్మికుల దినోత్సవం వచ్చేలా ప్లాన్ చేసి మరి యునెస్కో ఆరోజున కేటాయించిందని ప్రతి ఏడూ జూడు 12న బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నా కూడా బాల కార్మికులు ఏమాత్రం తగ్గలేదు అన్నారు. ఇంకా దుర్మార్గం ఏమిటంటే చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారిని అంగవైకల్యులు గా మార్చే వారి చేత బిచ్చమెత్తించే మాఫియా ఒకటి తయారైందని, ఈ బాలలందరినీ అద్భుతమైన రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నిరంతరాయం కృషి చేయవలసిన అవసరం ఉందని, శ్రీనివాస్ అన్నారు. వసి వాడుతున్న పసి జీవితం బాల్యం మొగ్గ తొడగకుండానే వసి వాడి పోతుందని కొంతమంది భవిష్యత్తును చీకటమయం చేస్తుందని అది ఇక్కడితో ఆగడం లేదని కొంతమంది మాఫీయా కూరల్లో చిక్కుకుంటున్నారని బాలికలైతే అత్యాచారాలకు కూడా గురి అవుతున్నారని వలస వచ్చిన కుటుంబాలే నగరాలలో పెరుగుతున్న ఈ తరహా సంస్కృతికి కారణం అని లెక్కలు చెబుతున్నాయని అన్నారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ఎన్ని చట్టాలు తెచ్చిన అవి తూతూ మంత్రంగానే పనిచేస్తున్నాయని అధికారులు స్వచ్ఛంద సంస్థలు బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని బాలలకు కొన్ని హక్కులు ఉంటాయని బాలలు చిన్నప్పటి నుంచి విద్యను అభ్యసించి మంచి కుటుంబంతో మంచి పరిసరాలతో అంటే దేశ ప్రగతికి దోహదపడేలా వాళ్ళ బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దవలసిన అవసరం బావి భారత పౌరులుగా మనందరి మీద ఉందని 14 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలతో ఎటువంటి పనులు చేయించకూడదని ఈ వయసు గల పిల్లలలో పని చేయిస్తే శిక్ష ఉంటుంది అనేది తెలిసేలా ప్రచారం చేయాలని అంటే మూడు నెలలు జైలు శిక్ష ఫలితంగా పదివేల వరకు జరిమానా విధిస్తారని వీటిని మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ చిన్నారుల కష్టాన్ని దోచుకుంటున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల పోషణ భారంతో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తే వారిలో కూడా జీవించాలని ఆశ చిగురించి ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి రేపటి తరంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రధానిగా పోలీస్ అధికారిగా రాష్ట్రపతిగా రూపాంతరం చెంది భారత మాత ముద్దుబిడ్డలుగా వెలిగిపోవాలని కోరుకుంటూ చిన్నారి బాలబాలికల అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.









