అధిక సంఖ్యలో విద్యార్థుల రవాణాపై ఆగ్రహం
స్కూల్ యాజమాన్యంపై చర్యలకు ఆదేశం
కల్లూరు/ పెనుబల్లి,ఆర్గాన్ న్యూస్, జనవరి 2:
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేషన్‌పాడు గ్రామ సమీపంలో వివేకానంద స్కూల్‌కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ బస్సులో పరిమితికి మించి విద్యార్థులను తరలించడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.అలాగే గాయపడిన విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూల్ వాహనాల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని రవాణా శాఖ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


