Home సినిమా నెట్‌ఫ్లిక్స్ లో బ్యాడ్ బాయ్ బిలియనీర్స్

నెట్‌ఫ్లిక్స్ లో బ్యాడ్ బాయ్ బిలియనీర్స్

32
0

ఆర్గాన్:

బ్యాడ్ బాయ్ బిలియనీర్స్
సిరీస్ లో భాగంగా సత్యం రామలింగరాజుపై తీసిన ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతోంది.
దాదాపు ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది.
సత్యం స్కాం ఎలా జరిగిందనేదానిపైన మాత్రమే ఈ ఎపిసోడ్ ఫోకస్ చేసింది.
సత్య రామలింగరాజు నేపథ్యం, ఆయన ముందుచూపు, ఆయన లక్ష్యాలు.. తదితర అంశాలను ఆయనతో కలిసి సత్యంలో పని చేసిన ఎంతోమంది తమ మాటల్లోనే చెప్పారు.
ఆయన గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా నెగెటివ్ గా చెప్పలేదు.
పరిస్థితులు ఆయనతో అలా చేయించాయని మాత్రమే చెప్పారు.
ఆ సమస్య నుంచి బయట పడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు, అవి విఫలం కావడంతో చేసేదేమీ లేక.. తనను తాను దోషిగా చూపించుకున్నారని చెప్పుకొచ్చారు.
సత్యం స్కాం బయటపడిన రోజు ఉద్యోగుల భావేద్వేగాలు, ఉన్నతాధికారులు చేపట్టిన చర్యలు.. లాంటి వాటిని చూపించారు.
సహజంగా విదేశాల్లో మాత్రమే ఇలాంటి కాన్ఫెషన్స్ చూస్తుంటామని.. కానీ భారత్ లో రామలింగరాజు మాత్రమే కాన్ఫెషన్ కు ముందుకొచ్చారని అభిప్రాయపడ్డారు.
సహజంగా ఇండియాలో తప్పు చేసినా కూడా దొరక్కుండా తప్పించుకునేందు అనేక మార్గాలున్నాయని.., కానీ రామలింగరాజు అలా చేయకుండా confession ఇచ్చుకున్నారని వెల్లడించారు.
బహుశా నిజమేనేమో అనిపించింది.. ఎంతోమంది తప్పు చేసి కూడా దొరక్కుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మేనేజ్ చేసుకున్నారు.. చేసుకుంటున్నారు.
కానీ తాను తప్పు చేశానని రామలింగరాజు మాత్రమే బయటికొచ్చి చెప్పారు..
జైలుకెళ్లారు..
బెయిల్ పై బయటికొచ్చారు.
కోర్టుల్లో కేసు ఇంకా కొనసాగుతోంది.
EMRI – 108లాంటి ఆయన ఇనిషియేటివ్స్ ను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది.
సత్యం స్కాం ఎందుకు జరిగింది.. ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఉపయోగపడుతుంది.
వీలైతే ఓసారి చూడండి…!