- స్టడీ అవర్ పర్యవేక్షించిన పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు పి. చంద్రశేఖర్ హుజురాబాద్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) జమ్మికుంటలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని 100శాతం కు చేర్చే లక్ష్యంతో ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజూ సాయంత్రం 4:15 గంటల నుండి 5:15 గంటల వరకు నిర్వహిస్తున్న స్టడీ అవర్‌ను శనివారం రోజు ఆంగ్లం సబ్జెక్టుపై కేంద్రీకరించి నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు పి. చంద్రశేఖర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ఆయన,
“విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధత, బాధ్యతతో స్టడీ అవర్‌ను నిర్వహిస్తున్నారు. పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించడం మన పాఠశాల లక్ష్యం. అందుకోసం ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు” అన్నారు.
విద్యార్థులు కూడా స్టడీ అవర్‌లో చురుకుగా పాల్గొంటూ, ప్రతి రోజు సబ్జెక్టుల వారీగా పాఠాలను పునశ్చరణ చేసుకుంటూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.
పట్టుదలతో పఠనం కొనసాగిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ స్టడీ అవర్ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయినులు కె. జ్యోతి, కె. లక్ష్మి, ఉపాధ్యాయులు రాం. రాజయ్య తదితరులు పాల్గొన్నారు.








