Home Uncategorized గ్యాస్ కు 25 డేస్ గ్యాప్ !

గ్యాస్ కు 25 డేస్ గ్యాప్ !

16
0
  • యుద్ధం కారణంగా నగరంలో కమర్షియల్ గ్యాస్ కు బ్రేక్
  • కొన్ని కంపెనీలు మాత్రమే సరఫరా రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చ్ 10: పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల నడవడం జరుగుతున్న యుద్ధం ప్రభావానికి ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు డొమెస్టిక్ సిలిండర్ పై 60 కమర్షియల్ సిలిండర్ పై 115 వరకు పెంచారు వాణిజ సిలిండర్ల రేటు సర్వీసు ట్రాన్స్పోర్ట్ చార్జీలు కలుపుకొని కనిష్టంగా 2300, గరిష్టంగా 2500 వరకు చేశారు. దీనికి తోడు వాటి సరఫరా నిలిచిపోవడంతో టిఫిన్ సెంటర్లు హోటల్ లో రెస్టారెంట్ వ్యాపారులు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వాడే సిలిండర్లకు ప్రాధాన్యమిస్తూ నింపుతూ ఉండడంతో కమర్షియల్ సరఫరాలో అంతరాలు ఏర్పడ్డాయి ఇది ఇలా ఉండగా గతంలో డొమెస్టిక్ సిలిండర్ బుకింగ్ 21 రోజులు చేసుకునే అవకాశం ఉండగా తాజాగా కొరత ఏర్పడుతున్న తరుణంలో దాని కాలపరిమితి 25 రోజులకు పెంచారు. హోటల్ యజమానుల ఇబ్బందులు కొందరు హోటల్ వ్యాపారులు గతంలో రోజుకు రెండు మూడు సిలిండర్లు తీసుకొని తమ వ్యాపారాలు కొనసాగించేవారు తాజాగా ఆశించిన సరఫరా లేకపోవడంతో ఒక సిలిండర్ తో నడిపించుకుంటున్నారు దీనితో వ్యాపారం దెబ్బతిని నష్టం వాటిల్లుతుందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఇది ఇలా ఉండగా గ్రేటర్లో డొమెస్టిక్ ( గృహ) కనెక్షన్ సుమారు 42 లక్షలు ఉండగా వాణిజ్య కనెక్షన్లు లక్ష వరకు ఉంటాయి అని ఒక అంచనా. రంజాన్ వేళ్ళ ఎగుమతులలో నిశ్శబ్దం దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్న వీళ్ళ మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మాంసం రొయ్యలు పండ్లు, కూరగాయలు గల్ఫ్ దేశాలకు నిలిచిపోవడంతో ఆయా దేశాలలో రంజాన్ వేల స్టాక్ తగ్గిపోయి మార్కెట్లో నిశ్శబ్దం నెలకొందని ఎగుమతి దారులు చెబుతున్నారు రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందులో భాగంగా పండ్లు మాంసం ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉంటుందని అయితే యుద్ధ వాతావరణం వల్ల ఒమన్ కువైట్ సౌదీ దేశంలో ఎగుమతులు ఆగిపోవడంతో వ్యాపారంలో స్తబ్దత ఏర్పడింది.