నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.


