Home agriculture అకాల వర్షం – అపార నష్టం.

అకాల వర్షం – అపార నష్టం.

26
0
  • మొక్కజొన్న రైతుకు ఎకరాకు 40 వేలు నష్టపరిహారం అందించాలి
  • మాజీ జెడ్పి్టిసి బానోతు కొండ
  • అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటల పరిశీలన

బోనకల్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 24 :

మండలం లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండల వ్యాప్తంగా రైతులు సాగు చేస్తున్న వేల ఎకరాల మొక్కజొన్న పంట నేలకొరిగింది. మంగళవారం అఖిలపక్ష పార్టీ ల ఆధ్వర్యంలో బోనకల్ గ్రామానికి చెందిన గుగులోతు వెంకా దెబ్బతిన్న మొక్కజొన్న పంట పొలాన్ని పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి బానోతు కొండా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారిందని, ఒక ఎకరానికి సుమారు 50 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు కంట కన్నీరు మిగిలిందని, అన్నారు. జరిగిన పంట నష్టం పై ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి, ప్రతి ఎకరాకు 40,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తెల్లాకుల శ్రీనివాసరావు, ఉప్పర శ్రీను, గడ్డి కొప్పుల పుల్లయ్య, బిజెపి నాయకులు గంగుల నాగయ్య, గుగులోతు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు మరీదు శేషు, తెలుగుదేశం నాయకులు గంగుల శ్రీను, బాధిత రైతులు పాల్గొన్నారు.