Home తెలంగాణ ఆరోగ్యమే మహాభాగ్యం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఆరోగ్యమే మహాభాగ్యం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

40
0
  • భారతీయ జనతా పార్టీ మీర్ పేట అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,మార్చి 5: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన ఎదుగుదల ఉంటుందని అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు తెలిపారని భారతీయ జనతా పార్టీ మీర్ పేట అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి అన్నారు. గురువారం నాడు ప్రముఖ ఛానల్ ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి 58 ప్రశాంతి హిల్స్ డివిజన్ లో సిర్ల హిల్స్ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సు బాలాపూర్ ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాజి డాక్టర్ శ్రీనిధి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ మీ చేతులను సరైన టైంలో శుభ్రం చేసుకోవాలని ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన ఈనాడు ఈటీవీ బృందానికి ఎందుకు సహకరించిన డాక్టర్లకు సూపర్వైజర్లకు ఆశా వర్కర్లకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల బృందానికి విద్యార్థులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కాంతారావు హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ సునీత రవీందర్ రెడ్డి ఏఎన్ఎం బాలమణి వీణ ఆశా వర్కర్ కవిత తదితరులు పాల్గొన్నారు.