Home POLITICS ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం

9
0

సొసైటీ అధ్యక్షులు కొత్వాల

పేటచెర్వు గ్రామసభలో పాల్గొన్న కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 9:ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి సాధ్యం అవుతుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం కొత్తగూడెం కార్పొరేషన్ 9వ డివిజన్ పేటచెర్వులో జరిగిన గ్రామసభలో కొత్వాల పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలను చేపడుతున్నదని, గ్రామా సభలు నిర్వహించి, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్ ఎన్ ఎఫ్ బి ఎస్ , ఆసరా ఫించన్లు, ఒంటరి మహిళా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ, ప్రభుత్వాన్ని ఆదరించాలని కొత్వాల కోరారు.

ఈ సందర్భంగా కొత్వాల గ్రూపు మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ చరపా శాంతా, వార్డు ఆఫిసర్లు సామినేని సందీప్, ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు , రేనాటి శ్రీనివాసరావు, దారా చిరంజీవి, చరపా పాపారావు, పాకనాటి మధు, వర్స వసంత, పరిమి అచ్యుత్, ముగితి ప్రభాకర్, పలువురు అంగన్వాడీ, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.