Home Adyatmikam దేవస్థానం చైర్మన్ గాడాక్టర్ ప్రదీప్ కూరపాటి

దేవస్థానం చైర్మన్ గాడాక్టర్ ప్రదీప్ కూరపాటి

28
0
  • స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి
    దేవస్థానం(గుట్ట) నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. కూరపాటి ప్రదీప్ కుమార్

ఖమ్మం టూ టౌన్, ఆర్గాన్ న్యూస్ :

ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (గుట్ట) చైర్మన్‌గా ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎండోమెంట్ అధికారి సమత, ఈవో జగన్మోహన్ రావు సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, నిర్వహించి దేవస్థానం చైర్మన్‌గా డా. ప్రదీప్ కుమార్ తో పాటు ఇతర సభ్యులు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సభ్యులు తెలిపారు. దేవస్థానం కమిటీ సభ్యులుగా కర్నాటి రాధిక, చిన్ని మధుసూదన్ రావు, చల్లా మధుసూదన్ రావు, మోర్ల శ్రీనివాస్, మందడపు సాయి వెంకటకృష్ణ, కొల్లా నాగేందర్, చారుగుండ్ల రవికుమార్, పంతం సీతారాములు, శనగవరపు ప్రసాద్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొని నూతన సభ్యుల‌కు శుభాకాంక్షలు తెలిపారు.