వ్యాయామం పండ్లు మంచివి ఏప్రిల్ 7 “ప్రపంచ ఆరోగ్య దినోత్సవం “సందర్భంగా మన ఆర్గాన్ న్యూస్ పాఠకుల కొరకు అక్కినేపల్లి పురుషోత్తమరావు రంగారెడ్డి ప్రతినిధి అందిస్తున్న కధనం: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.. నేడు ఎవరిని కదిలించినా ఏదో ఒక నలత గురించి చెబుతూ ఉంటారు. కొందరు కొద్ది నలత ఉన్నప్పటికీ పట్టించుకోరు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన తర్వాత వైద్యుల దగ్గరకు ఉరుకులు, పరుగులు, పెడతారు. అయితే కాస్త శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉండే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన మేరకు పౌష్టికాహారం తీసుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండవచ్చునని వైద్యుల అభిప్రాయం. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత మందుల కోసం ఖర్చు చేయడం కంటే ముందు నుంచే పండ్లు, కూరగాయలు,పాలు,మాంస కృత్తులు వంటి వాటికి కేటాయించడం మంచిదని సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు వ్యాయామం లేక చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని వివరిస్తున్నారు నిపుణులు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం సమయం పాటించకపోవడం వల్ల కల్తీ పదార్థాలు తెలుసుకోవడం వలన అనారోగ్యాలు పాలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని నేటి నుంచే ఇలా చేయడానికి ప్రయత్నం మొదలు పెడదాం. సురక్షితమైన నీటినే తాగాలి పరిశుభ్రమైన నీటిని తాగాలి మంచినీరు తాగితే 50 శాతం రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు, నీరు కలుషితం అయింది అనే అనుమానం ఉంటే కాచి వడపోసి తాగాలి, నీటితో పాటు పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం, రోజుకు 250 మిల్లీలీటర్లు కాచి చల్లార్చిన లేదా పాశ్చరైజ్డ్ పాలను వాడితే మంచిది, కాఫీ కంటే టీ తీసుకుంటే మంచిది అది కూడా ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ వద్దు. వీటితో జరభద్రం వంట నూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటివి చాలా తక్కువగా వినియోగించాలి. ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరిగి స్థూలకాయం తద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్, లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారులు మేక మాంసం, కోడి మాంసం, బదులు చేపలు తీసుకుంటే మేలు. మాంసాహారంలోనూ లివర్, కిడ్నీ, బ్రెయిన్,వంటి పదార్థాలు మానుకోవడం మంచిది. ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. రెండు మూడు రోజులు ఫ్రిజ్ లోనిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు. విపరీతమైన ఉపవాసాలు లాంటివి చేయడం మంచిది కాదు. చక్కెర కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాన్ని మద్యాన్ని తగ్గించాలి. ఎక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకోవద్దు ఊరగాయలు, ఉప్పు, బిస్కెట్లు, చిప్స్, వెన్న, పిజ్జా, శీతల పానీయాలు ప్రాసెస్ చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం-యోగ ధ్యానం యోగాభ్యాసం వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. పొగతాగడం పొగాకు నవలడం గుట్కా మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. 30 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. పిల్లలు గర్భిణీలకు రోగ నిరోధక మందులు టీకాలు వంటివి ఇప్పించాలి వినియోగానికి ముందు కూరగాయలు పండ్లు శుభ్రంగా కడగాలి వండిన పదార్థాన్ని సరైన విధంగా నిల్వ ఉంచి సూక్ష్మక్రియలు ఎలుకలు కీటకాల బారి నుండి కాపాడుకోవాలి. ఇలా చేస్తే ఆహారం ఒకేసారి కాకుండా ప్రతి మూడు గంటలకు ఒకసారి కొంచెం కొంచెం తీసుకోవడం ఉత్తమం. ఆహారం తీసుకునే పదార్థాలు ఎక్కువ సేపు ఉడకపెట్టకూడదు. మంచి నిద్ర అవసరం నిద్ర అనేది ఎవరికి వాళ్లు చూసుకోవలసిన అంశం. ఏదో విధంగా రోజుకు 7:00 నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. సెలవు రోజుల్ని నిద్రకే అంకితం చేయాలి. నిద్ర వేళ్ళతో పాటు భోజనం వేళల్లో కూడా మార్పులు చెందుతున్నాయి.ఇవి శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనిని నివారించడానికి సమయం ప్రకారం నిద్రపోవాలి. రాత్రివేళ నిద్ర వల్ల శరీర పనితీరు మెరుగ్గా ఉంటుంది. రోగ నిరోధక విధానం అభివృద్ధి చెందుతుంది. గాఢ నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి ప్రశాంతత దొరుకుతుంది. రోజు పెద్దవాళ్లు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవడం మంచిది. చురుకుగా పనిచేయడానికి నిద్ర చాలా ఉపయోగపడుతుంది. శరీరానికి వ్యాయామం తప్పనిసరి అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.