Home POLITICS సస్పెండ్ అయిన డిప్యూటీ కమిషనర్ నుండి అవినీతి సొమ్ము రికవరీ చేయాలి

సస్పెండ్ అయిన డిప్యూటీ కమిషనర్ నుండి అవినీతి సొమ్ము రికవరీ చేయాలి

15
0
  • భారత రాష్ట్ర సమితి బడంగ్ పేట అధ్యక్షులు రామిడి రాంరెడ్డి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 6: బడంగ్ పేట సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ సరస్వతి తో పాటు సస్పెన్షన్ కు గురైన అధికారుల వద్ద నుండి అవినీతి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వం దీనిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ నిర్వహించి నిగ్గు తేల్చాలని భారత రాష్ట్ర సమితి బడంగ్ పేట అధ్యక్షులు రామిడి రాంరెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లతో కలిసి బడంగ్ పేటలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఈ అంశం చర్చనీయాంశంగా మారిందని అవినీతి బాగోతం వ్యవహారంలో అవినీతి అధికారులను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రోత్సహించినట్లుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో వెల్లడి అయ్యిందని ఈ ప్రెస్ మీట్ లో ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ పాల్గొనకపోవడం మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ఉన్న పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మాజీ వైస్ చైర్మన్ కానీ ఆ పార్టీల మాజీ కౌన్సిలర్లు గాని మాజీ కార్పొరేటర్లతో చర్చించి ప్రజలు తమను ఎన్నుకున్నందుకు వారికి జవాబుదారీగా ఒక కామన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఉంటే బాగుండేదని సూచించారు. ఇందుకు మాజీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ స్పందిస్తారని అనుకున్నాము కానీ వారు ఆ ప్రయత్నం చేయకపోవడంతో ప్రజలలో తమపై తప్పుడు ప్రచారం వెళుతుందని తామే స్వయంగా గత పదివేల పాలకవర్గం చేసిన కార్యక్రమాలపై విచారణ చేపట్టి దోషులుగా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహించిన కమిషనర్ని జిహెచ్ఎంసి లో విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు పైరవీలు చేసి ఆమెనే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యంగా హోంశాఖ, విద్య,మున్సిపల్ శాఖల మంత్రులు లేకపోవడంతో ఎవరిని అడగాలో అయోమయంగా ఉందని అన్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు బడంగ్ పేట సర్కిల్లో జరిగిన అవినీతి ఆరోపణలు అందరివేళ్ళు ఆ ఇద్దరి వైపు చూపిస్తున్నాయని ఆరోపించారు. తాము వారికి కార్పొరేషన్ లో జరిగిన అభివృద్ధికి సహకరించామని అవినీతికి కాదని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ లో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ఎల్.ఆర్.ఎస్ పేరిట జరిగిన మోసాలు అవినీతిపై ఎంక్వయిరీ చేయించి దోషులను కఠినంగా శిక్షించి ఖజానాకు గండి కొట్టిన సొమ్మును రాబట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ భారత రాష్ట్ర సమితి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాసరెడ్డి, యాతం పవన్, సుక్కా శివకుమార్, మాజీ కో ఆప్షన్ సభ్యులు రఘునందన్ చారి, సీనియర్ నాయకులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, ఒంగేటి లక్ష్మారెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి,గట్టు మహిపాల్, పుట్టగళ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.