- వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సిహెచ్ వి ఆర్ కె మూర్తి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,ఫిబ్రవరి 3: వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ గ్రంథాలయం మెయిన్ గేటు పక్కన రిక్షాలలో చెత్త తీసుకొని వచ్చి వనస్థలిపురం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అని జిహెచ్ఎంసి అధికారులను వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సిహెచ్ వి ఆర్ కే మూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ వనస్థలిపురం ప్రభుత్వ లైబ్రరీ మెయిన్ గేటు పక్కన చెత్తతో పాటు కుళ్లిపోయిన కళేబరాలు, చనిపోయిన కుక్కలు పిల్లుల కళేబరాలు తీసుకొని వచ్చి వేస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా అధికారులలో చైతన్యం లేదని, దీనితో ఈ ప్రాంత ప్రజలంతా వివిధ వ్యాధులతో ఇబ్బంది పడడమే కాక దోమలతో అనేక రోగాలు వస్తున్నాయని తక్షణమే అధికారులు స్పందించి వనస్థలిపురం ప్రజల ప్రాణాలు కాపాడాలని సి హెచ్ వి ఆర్ కే మూర్తి కోరారు.


