Home తెలంగాణ ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని యంత్రాలు

ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని యంత్రాలు

21
0
  • బీజేపీ ఆందోళన

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 7:

ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండల అధ్యక్షులు వినుకొల్లు చక్రవర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పలు యంత్రాలు పనిచేయకపోవడం, సదుపాయాల లోపం వల్ల పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

పనిచేయని డెంటల్ యంత్రాలు, డయాలసిస్ లో లోపాలు

గత సంవత్సరం కిందట ఆసుపత్రికి వచ్చిన డెంటల్ ఎక్విప్మెంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. డయాలసిస్ సదుపాయం పేరుకే ఉండి, అవసరమైన బెడ్స్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు

పేషెంట్ల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని విమర్శించారు. చుట్టుపక్కల గ్రామాలకు ఈ ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ, సరైన సేవలు అందడం లేదన్నారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

డయాలసిస్ బెడ్స్ సంఖ్య పెంచాలని, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని, అన్ని యంత్రాలను వెంటనే వినియోగంలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఈ కేంద్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలతో సంబంధం ఉన్న అంశాల్లో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.