Home తెలంగాణ బడంగ్‌పేటలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు

బడంగ్‌పేటలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు

18
0
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్. ప్రసాద్

రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 1:

విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని, సమాజానికి ఉపయోగపడే విధంగా మారాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బడంగ్‌పేట ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్. ప్రసాద్ సూచించారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న కళాశాల విద్యార్థినీ-విద్యార్థులు బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెడ్ రిబ్బన్ ఆకారంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడంతో ర్యాలీకి స్థానికులు ప్రశంసలు అందించారు.
ఈ సందర్భంగా ప్రధానాచార్యులు డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ,
“మానవ జీవితం ఎంతో విలువైనది; దాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలి” అని విద్యార్థులకు సూచించారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చిలుకూరి వెంకట్‌రెడ్డి విద్యార్థులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించి, వారికి ఉన్న అపోహలను నివృత్తి చేశారు.
డాక్టర్ సి.హెచ్. రామరాజు, సి.హెచ్. నరసింహరాజు మాట్లాడుతూ,
“ఎయిడ్స్ నివారణలో విద్యార్థుల పాత్ర కీలకం. అవగాహనను సమాజంలోకి తీసుకెళ్లడం ప్రతి విద్యార్థి బాధ్యత” అని తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ రేవతి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ కిరణ్మయి, రోహిత్, విజయ, సుస్మిత, సురేందర్ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.