Home క్రైమ్ ఎన్నికలకు వాహనాల్లో అక్రమ మద్యం రవాణా

ఎన్నికలకు వాహనాల్లో అక్రమ మద్యం రవాణా

33
0
  • పోలీసుల ఉక్కుపాదం

సూర్యాపేట ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 1:

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో దురాజ్‌పల్లి ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో భారీగా అక్రమ మద్యం పట్టివేశారు.
పోలీసు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో TG 29 T 0002 నంబర్ గల ఎర్టిగా కారును ఆపి పరీక్షించిన పోలీసులు, ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న 11 కాటన్ బాక్సుల్లో మొత్తం 528 ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం సూర్యాపేట నుండి మున్యా నాయక్ తండాకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
కారును నడుపుతున్న ధారవత్ సైదా, అలాగే మద్యం కొనుగోలు చేసిన ధరవత్ నాగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించారు. పంచనామా అనంతరం కారుతో పాటు మద్యం మొత్తాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసిన మద్యం మార్కెట్ విలువ దాదాపు రూ. 1 లక్షగా అంచనా వేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎవరైనా ఇంట్లో గాని, షాపుల్లో గాని మద్యం నిల్వచేసినా లేదా రవాణా చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చివ్వెంల ఎస్సై వీ. మహేశ్వర్ హెచ్చరించారు.