- కార్మిక వర్గం నష్టం కలిగించే నాలుగు లేబర్ కోల్డ్ ఎత్తివేయాలి
- రైతుకు నష్టం కలిగించే
నల్ల చట్టాలు రద్దు చేయాలి - వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి వెంకట్
- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఆర్గాన్,డిసెంబర్ 24:
కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 26వ తేదీన వి బి జి రాంజీ బిల్లు రద్దు చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా జీవో కాపీలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.
2005లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యూపీఏ వన్ ప్రభుత్వం వామపక్ష పార్టీల ఎంపీల మద్దతు వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్త ఉద్యమాల ఫలితంగా చట్టం రావడం జరిగింది దీని కారణంగా దేశంలో కోట్లాదిమంది నిరుపేదలకు వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరికింది దేశంలో ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగింది 100 రోజులు పని కల్పించడం జరిగింది దాని ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో పేదలకు కూలీలకు కొంత ఆర్థిక ఉపశమనం దొరికింది కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ నాయకత్వంలో గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్లో పెట్టిన విక్షిత్ భారత్ రోజుగర్ మిషిన్ అనే పథకం తీసుకొచ్చి కూలీలకు 60 రోజులు పని దినాలు తగ్గించారు 90 శాతం కేంద్ర బడ్జెట్ కేటాయించాలి కానీ 60% కేంద్రం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని రాష్ట్రాలపై భారం మోపారు. దీని కారణంగా చట్టం పోయి స్కీమ్ గా వచ్చి ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ దయాదాక్ష నాలా మీదనే ఆధారపడింది దేశంలో 35 కోట్ల మంది ఉన్న వ్యవసాయ కూలీలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఒకవైపు యంత్రాలు వచ్చి పనుకోల్పోతున్నారు మరోవైపు ఉపాధిచట్టమును షరతులు విధించటం సరైనది కాదని వెంటనే వి బి జి రామ్ జి బిల్లును ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి వెంకట్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రైతు రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరావు ఈరోజు ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు. వి బి జి రామ్ జి బిల్లు రద్దు లేబర్ కోడ్ 4 చట్టాలు రద్దు చేయాలని. రైతు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 26న నిరసన కార్యక్రమాలు జనవరి 8 నుండి 19 వరకు గ్రామ గ్రామాన ప్రచార జాతాలు 19వ తేదీన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ ప్రెస్ మీట్ లో బుర్రి ప్రసాద్ పొన్నం వెంకటేశ్వరరావు కళ్యాణం వెంకటేశ్వరరావు యర్రా శ్రీనివాసరావు మెరుగు సత్యనారాయణ తుమ్మ విష్ణు తదితరులు పాల్గొన్నారు








