- హైదరాబాద్2 డిపో మేనేజర్ ఎం కరుణశ్రీ రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, మార్చి 31: రాష్ట్ర మహిళా మణులు అందరికీ పదివేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా చేసినందుకు అభినందనలు తెలుపుతున్నానని, హైదరాబాదు 2 డిపో మేనేజర్ ఎం కరుణ శ్రీ అన్నారు. మంగళవారం నాడు హైదరాబాదు 2 డిపో, దిల్సుఖ్నగర్ బస్సు స్టేషన్లో, మహాలక్ష్మి పథకం ద్వారా 20090 కోట్ల ఉచిత ప్రయాణాలు, పదివేల కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా బస్సులలో నిరంతరాయంగా ప్రయాణం చేస్తున్న 5 మంది మహిళలను గుర్తించి వారిని ఆహ్వానించి డిపో మేనేజర్ ఎం కరుణ శ్రీ శాలువాలతో సత్కరించారు అనంతరం బహుమతులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కరుణశ్రీ తో పాటు, ఏ ఎం టి. వి. ఉషశ్రీ, ఏ ఎం ఎఫ్ సతీష్, డిప్యూటీ సూపర్ ఎంటెండెంట్ ఉమాపతి స్టోర్ ఇన్చార్జి పాల్గొన్నారు.


