Home తెలంగాణ అన్నారం-జమ్మికుంట రహదారి వెంటనే నిర్మించాలి

అన్నారం-జమ్మికుంట రహదారి వెంటనే నిర్మించాలి

34
0
  • తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 21:

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ మండలం, అన్నారం గ్రామం నుంచి జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్న స్థితిలో ఉండటంతో గ్రామ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయి కంటి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. రహదారి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో గుర్తుపట్ట లేకుండా మారిన రహదారి వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని వారు తెలిపారు. ముఖ్యంగా రోడ్డాం వద్ద తారు వేయకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాయి కంటి శ్రీనివాస్ మాట్లాడుతూ… మానకొండూర్ నుంచి జమ్మికుంటకు వెళ్లే ఈ రహదారి వేలాది మంది ప్రయాణికులు, రైతులు, కార్మికులకు కీలక మార్గమని పేర్కొన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా పనులు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కరీంనగర్ ఎంపీ వెంటనే స్పందించి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని రహదారి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ గ్రామ కార్యదర్శి నెల్లి కనకయ్య, నెల్లి మహేష్, గొల్లపల్లి నరేష్, సాత్విక్ రెడ్డి, రోడ్డ శ్రీమాన్, పి.శ్రీకాంత్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.