Home క్రీడలు అఖిల భారత పోలీస్ క్రీడల్లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి ప్రతిభ

అఖిల భారత పోలీస్ క్రీడల్లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి ప్రతిభ

47
0
  • టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో నాలుగు పతకాలు సాధించిన అధికారి కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 15:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఈ నెల 9 నుండి 13 వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మక “అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలు”లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి అద్భుత ప్రతిభ కనబరిచారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో విశేషంగా రాణించి మొత్తం నాలుగు పతకాలను కైవసం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న పోలీస్ అధికారుల మధ్య జరిగిన తీవ్ర పోటీలో మాధవి తన ప్రతిభను చాటుతూ తెలంగాణ పోలీస్ శాఖకు, కరీంనగర్ కమిషనరేట్‌కు గౌరవాన్ని తీసుకొచ్చారు.
జాతీయ స్థాయి క్రీడల్లో విజయాలు సాధించడం ద్వారా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పేరు దేశవ్యాప్తంగా నిలిపారని అధికారులు ప్రశంసించారు. క్రీడల పట్ల ఆమె చూపుతున్న అంకితభావం ఇతర పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాధవిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఘనంగా అభినందించారు. ఆమె సాధించిన విజయాలు పోలీస్ శాఖకు గర్వకారణమని తెలిపారు. సహచర అధికారులు, సిబ్బంది కూడా మాధవికి శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రీడలతో పాటు విధుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.