టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇంటవిషాదం నెలకొంది గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాత ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు.. వెంకట్రావుకు భార్య ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకొడుకు దర్శకుడు ఇవివీ సత్యనారాయణ అల్లరి నరేష్ తండ్రి 2011లో మరణించిన సంగతి తెలిసిందే. కాగా వెంకట్రావు భౌతిక గాయానికి ఇవాళ సాయంత్రం నిడదవోలులో అంత్యక్రియలు జరగనున్నాయి.


