Home POLITICS నిబంధనలు పక్కనబెట్టి డిప్యూటీ మేయర్‌కు ఛాంబర్ ?

నిబంధనలు పక్కనబెట్టి డిప్యూటీ మేయర్‌కు ఛాంబర్ ?

36
0
  • కరీంనగర్ మున్సిపల్‌లో బిజెపి తీరుపై సిపిఐ ధ్వజం కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 19:

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్‌కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని సిపిఐ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిర్ణయాన్ని రద్దు చేసి ఛాంబర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
గురువారం సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం డిప్యూటీ కమిషనర్ ఖజా మొయినుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించింది. మున్సిపల్ చట్టాల్లో డిప్యూటీ మేయర్‌కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించాలని ఎక్కడా ప్రస్తావన లేదని వారు స్పష్టం చేశారు.
గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలంలో ఇలాంటి నిర్ణయాలు వివాదాలకు దారితీశాయని గుర్తుచేస్తూ, అవినీతి, అధికార దుర్వినియోగానికి ఆ ఛాంబర్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే మార్గంలో నడవడం ఆశ్చర్యకరమని సురేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు, మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
నగర పాలక వ్యవస్థలో మేయర్ ప్రథమ పౌరుడని, మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ మేయర్‌కే ఉండాలని, మిగతా కార్పొరేటర్లు సమాన హోదాలో ఉంటారని పేర్కొన్నారు. బిజెపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు.
ఈ వినతిపత్రం సమర్పణలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, గామినేని సత్యం తదితరులు పాల్గొన్నారు.