Home Uncategorized మీ సేవల్లో తనికీలు

మీ సేవల్లో తనికీలు

17
0
  • మంగపేట ఏటూరునాగారం తాడ్వాయి మండలాలలో మీసేవ ఆధార్ సెంటర్ల తనిఖీలు
  • 2 నిమిషాల్లో కుల ధృవీకరణ పత్రం మంజూరు
  • మీసేవ లో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ తప్పులు లేకుండా నమోదు చేయాలి
  • మీసేవ లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ సర్వీసు ను రైతులందరూ వినియోగించు కోవాలి
  • నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు
  • యూనివర్సల్ క్లైంట్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆధార్ సేవలు మరింత సులభ తరం
  • ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 27:

మంగపేట ఏటూర్ నాగారం తాడువాయి మండలం లోని పలు మీసేవ కేంద్రాలను ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ మీసేవ మేనేజర్లు విజయ్ రాకేష్ లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.
ప్రస్తుతం ప్రజలకు మీసేవ ద్వారా రెండు నిమిషాల వ్యవధిలోనే కుల దృవీకరణ పత్రం అందజేయబడుతుంది. అలాగే టి జి పి ఎస్ సి పోర్టల్ లో ఓ టీ ఆర్ అప్డేట్ చేసుకొనుటకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ నమోదు చేయడంలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు.కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ సర్వీస్ గురించి మీసేవ నిర్వాహకులకు వివరించారు. ఏ విధమైన టెక్నికల్ సమస్యలు వచ్చిన అతి త్వరగా క్లియర్ చేస్తామని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ప్రతి అప్లికేషన్ నమోదు చేయాలని తెలిపారు.
మీసేవ కేంద్రాలను ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఇ ఎస్ డి గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపవలనని సూచించారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీసేవ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చార్టర్ భూభారతి కి సంబంధించిన ఫ్లెక్సీలు మీసేవ లోగో తాహాసిల్దార్ ఈడీఎం పరిష్కారం కాల్ సెంటర్ల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవలెనని ఆదేశించారు. ఆపరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ భూభారతి మరియు మిగతా ఆన్లైన్ సర్వీస్ లను ప్రజలకు అందించాలని సూచించారు.
కళ్యాణ లక్ష్మి, బర్త్ డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల సున్నితంగా ఉంటూ వారికి మీసేవ సర్వీసులను ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ రాకేష్ మీసేవ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.