Home తెలంగాణ మండల కేంద్రంలో ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతి

మండల కేంద్రంలో ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతి

15
0

తిరుమలయపాలెం ఆర్గాన్ న్యూస్,ఫిబ్రవరి 27 :

స్థానిక మండల కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలు శుక్రవారం జరిగాయి.
భారత స్వతంత్ర సంగ్రామ విప్లవ యోధుదు చంద్రశేఖర్ ఆజాద్ అని పాలేరు నియోజకవర్గ జేఏసీ సంఘాల అధ్యక్షుడు మందడి ఇజ్రాయిల్ అన్నారు.మండల కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ 95 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పిస్తూ నినాదాలతో ఘనంగా నివాళులర్పించారు.వారు మాట్లాడుతూ దేశ స్వతంత్ర కోసం చేసిన పోరాటం గురించి వివరించి సేవలను గుర్తు చేసుకొని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బాణోత్ సిమ్లా నాయక్, అనిల్,నిమ్మల వెంకన్న, గుగ్గిల అంబెడ్కర్ ,జెఏసి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.