Home agriculture లక్ష్మీపూర్ గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ

లక్ష్మీపూర్ గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ

18
0

మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 28:

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పశు వైద్య కేంద్రం ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పశుగణన అధికారి ఒలగుత్తుల పోచయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ ఎడ్ల సత్యనారాయణ, ఉపసర్పంచ్ రాపాక ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరై గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పశుపోషకుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని, గొర్రెలు, మేకల ఆరోగ్యం మెరుగుపడేలా ఇలాంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని గొర్రె కాపరులను కోరారు. దాదాపు 1500 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గొర్రె కాపర్ల సంఘం అధ్యక్షులు చుక్క రాజమల్లు, వార్డు మెంబర్లు చుక్క శ్రీనివాస్, నగునూరి సంపత్, కొమ్మగల్ల కవిత–అశోక్, పాదం సందీప్, వీర్ల కొటేశ్వర్, తొంటి ఓదెలు, గ్రామస్తులు అమ్ముల కుమారస్వామి, చుక్క కొండయ్య, కొయ్యడ రంగస్వామి, ఎర్ర కొమురయ్య, కూకట్ల రంగస్వామి, పెద్ది శ్రీకాంత్, బండారి మల్లేష్, రాపాక రమేష్, పిట్టల రంగస్వామి, కాల్వ ఓదెలు, కాల్వ లక్ష్మయ్య, ఆఫీస్ కోఆర్డినేటర్ వి. మల్లయ్యతో పాటు గొర్రె కాపర్ల సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.