Home agriculture ఈసారి విరగబూసిన మామిడి తోటలు

ఈసారి విరగబూసిన మామిడి తోటలు

19
0
  • అకాల వర్షాలతో రాలిన పూత
  • మూడు సంవత్సరాలుగా నష్టాలు చవిచూస్తున్న మామిడి రైతులు రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 25: ఈ ఏడాది మామిడి దిగులు పై రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే గత రెండు మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో వర్షాలతో పూచిన పువ్వు రాలిపోవడంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితి దాపురించింది. ఈసారి వాతావరణం అనుకూలించడంతో మామిడి పూత విపరీతంగా వచ్చింది రాష్ట్రంలోనే అనేక జిల్లాలలో మామిడి తోటలు విరగబోసి రైతుల ఆశలు నింపుతున్నాయి. కానీ అకాల వర్షాలు ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. కొమ్మ కొమ్మకు విరిసిన పసుపు రంగు మామిడి పూత ఉండడంతో ఈసారి మామిడి సాగు లావదాయకంగా ఉంటుందా లేక ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుందా అనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది. గత మూడు సంవత్సరాలుగా మామిడి సాగు రైతులకు లాభసాటిగా ఉండని పరిస్థితి నెలకొంది మూడు సంవత్సరాలుగా వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో చీడపీడలు తెగుళ్లు మామిడికాయ తీవ్ర ప్రభావాన్ని చూపాయి మధ్యలో చలి కారణంగా పూత పిందే రాలిపోయింది ఇలాంటి పరిస్థితులలో గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం మామిడి పూత ఆశాజనకంగా ఉన్న ఒకటి రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలు రైతును నిరాశ నిస్పృహల్లో ముంచుతున్నాయి. మామిడి పంట రైతుల ఆదాయానికి ప్రధాన ఆధారం కావడంతో పూత నుంచి కాయ దశ వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు పూత ఖాతా దశలో ఈదురుగాలులు అకాల వర్షాలు లేకపోతే మామిడి సాగు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.