Home agriculture పతనమైన టమాటా ధర

పతనమైన టమాటా ధర

20
0
  • బహిరంగ మార్కెట్లో 15 నుంచి 20 వరకు అమ్మకాలు
  • కర్ణాటక ఏపీ నుండి పంట దిగుబడి చేయించుకుంటున్న వ్యాపారులు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 25: టమాటా రేట్లు పడిపోయాయి. గత రెండు వారాలుగా మార్కెట్లో వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు కిలో 20 వరకు పలకగా ప్రస్తుతం ఐదు రూపాయలకు పడిపోయింది. ఈ ధర రైతుకు గిట్టుబాటు కాక తెచ్చిన సరుకులు ఇంటికి తీసుకు వెళ్లలేక వచ్చిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, నుంచి దిగుమతి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, మదనపల్లె కర్ణాటకలోని రాయచూర్, బెంగుళూరు ప్రాంతాలలో ఈ సీజన్లో టమాట సాగు ఎక్కువగా జరిగింది. ఈ ఏడాది వర్షాలు వాతావరణం అనుకూలంగా ఉండడంతో అక్కడ టమాటా దిగుబడులు ఆశించిన దాని కన్నా రెట్టింపుగా వచ్చాయి. ఈ క్రమంలో రైతులు పెద్ద మొత్తంలో పంటను మార్కెట్లకు తెస్తూ ఉండడంతో రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీనితో ఈ ప్రభావం తెలంగాణ పై పడింది. ఇక్కడి హోల్సేల్ మార్కెట్లో హైబ్రిడ్ రకానికి చెందిన టమాటా5 నుండి 6 వరకు లోకల్ టమాట 2 నుంచి 3 వరకు దొరుకుతూ ఉండడంతో తెలంగాణ రైతులు అక్కడి పంటను దిగుమతి చేసుకుంటున్నారు ఈ క్రమంలో స్థానికంగా సాగు అయిన పంటకు డిమాండ్ పడిపోయింది. దీనికి తోడు వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి హైబ్రిడ్ రకం టమాటాను దిగుమతి చేసుకుంటూ ఉండడంతో లోకల్ టమాట ఎవరూ కొనడం లేదు. 70 రూపాయలకే 25 కిలోల బాక్స్ రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్, యాచారం మహేశ్వరం చేవెళ్ల మండలాలలో టమాట అధికంగా పండింది. నవంబర్లో టమాటా పెట్టుకోగా అదే నెల చివరి లో నాట్లు వేశారు దీని పంట కాలం 70 రోజులుగా ప్రస్తుతం క్రాప్ ప్రారంభం అయ్యింది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో ఇక్కడ ఆశించిన స్థాయి కంటే దిగుబడులు అధికంగా వస్తున్నాయి. యాచారం ఇబ్రహీంపట్నం మార్కెట్లలో మంగళవారం ఒక్క బాక్స్ ( 25 కిలోలు ) వ్యాపారులు 70 రూపాయలకే కొనుగోలు చేశారు ఈ ధరలు రైతుకు గిట్టుబాటు కావడం లేదు కనీసం రవాణా చార్జీలు సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రూపాయలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. ఓపెన్ మార్కెట్లో అధిక ధరలు హోల్సేల్ రైతుల నుంచి పంటను తక్కువ ధరకుకుంటున్న వ్యాపారులు అదే పంటను రిటైల్ వ్యాపారులు డబల్ రేటుకు అమ్ముతున్నారు. క్వింటాల్ లెక్కన రిటైల్ వ్యాపారులు కొంటూ ఉండటంతో వారికి కిలో టమాట పది రూపాయల వరకు పడుతుంది దీనితో వారు బహిరంగ మార్కెట్లో 15 నుంచి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు ఆయా ప్రాంతాలలో జరిగిన సంతలలో 18 వరకు కిలో చొప్పున అమ్మకాలు కొనసాగిస్తున్నారు కానీ రైతులకు మాత్రం కిలోపు అతి తక్కువ ధర చెల్లిస్తున్నారు.