Home జాతీయం 550 కోట్ల సైబర్ క్రైమ్ ప్రధాన నిందితుడు లొంగుబాటు

550 కోట్ల సైబర్ క్రైమ్ ప్రధాన నిందితుడు లొంగుబాటు

24
0
  • పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు సత్తుపల్లి/కల్లూరు, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 23:

హైదరాబాద్ కేంద్రంగా మ్యాట్రిమోనీ, పెట్టుబడి, రివార్డ్ పాయింట్స్, వంటి వివిధ మార్గాల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుల ముఠాను ఈ ఏడాది జనవరి 11న పెనుబల్లి మండలం వీఎం.బంజర పోలీసులు మొత్తం 24 మందికి గాను 18 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్తుపల్లికి చెందిన ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ. 80.41 కోట్లు, ఆయన భార్య మేడ భానుప్రియ ఖాతాలో రూ. 45.62 కోట్లు, బామ్మర్ది అయిన మేడ సతీష్ ఖాతాలో రూ. 135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ. 81.72 కోట్లు.. కరీంనగర్‌కు చెందిన తాటికొండ రాజు ఖాతాలో రూ. 92.54 కోట్లు, మొత్తంగా రూ.435.73.. కోట్ల రూపాయలు వీరి ఖాతాల్లోకి పంపాడు. నిందితుడు గత రెండు నెలలుగా విదేశాలకు పారిపోయి తలదాచుకోగా పోలీసులు దర్యాప్తులో భాగంగా విఫలప్రయత్నం చేయటంతో ఎట్టకేలకు సోమవారం ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ ఎదుట నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరి లొంగిపోయాడు.

పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు..

రూ.549 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ కేసులో 18 మందితో పాటు ఇప్పటికే పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. మూడువ ప్రధాన నిందితుడిగా ఉన్న ఉడతనేని వికాస్ చౌదరి అరెస్ట్‌తో 21మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ కావాల్సి ఉంది. మూడవ ప్రధాన నిందితుడిగా ఉన్న ఉడతనేని వికాస్ చౌదరి అరెస్ట్‌తో నాలుగు ఖాతాలకు తరలిన రూ.435.73. నగదు లావాదేవీల చిక్కుముడి వీడినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయిన సైబర్ క్రైమ్ నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని అదుపులోకి తీసుకొని.. సత్తుపల్లి, వీఎం. బంజర పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులు పూర్తిస్థాయిలో కేసును విచారిస్తున్నారు.