Home తెలంగాణ జిల్లా గ్రంథాలయంలో విద్యార్థుల కష్టాలు

జిల్లా గ్రంథాలయంలో విద్యార్థుల కష్టాలు

18
0
  • అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం ! రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,జనవరి 30: బడంగ్ పేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయం పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ విద్యార్థులకు నరకప్రాయంగా మారింది అని భారతీయ జనతా పార్టీ బడంగ్ పేట అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు, పైన పటారం లోన లొటారం అన్నట్లుగా గ్రంథాలయ పరిస్థితి ఉందని విమర్శించారు. గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు సరైన కుర్చీలు ప్యాడ్స్ వసతులు లేవని తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ అవుట్లెట్ లేక సెప్టిక్ ట్యాంకు ప్రతిరోజు పొంగిపొర్లుతూ భయంకరమైన దుర్వాసనతో విద్యార్థులు చదవలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని నీటి సంపు పై మూత లేక ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు. గ్రంథాలయం పక్కనే డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఇతర ఉన్నతాధికారులు కార్యాలయాలు ఉన్నప్పటికీ ఈ సమస్యలు కల్పించకపోవడం పరమ వైఫల్యం అని మండిపడ్డారు. పారిశుద్ధ్యం పై స్పెషల్ డ్రైవ్ అంటున్న అధికారులు ఇదేనా? మీ స్పెషల్ డ్రైవ్ అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని అధికారులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేశపాక జగన్ కార్పొరేషన్ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, గ్రంధాలయ విద్యార్థులు పాల్గొన్నారు.